MDK: తూప్రాన్ పట్టణ పరిధి హనుమాన్ వెంచర్లో గంజాయి సేవిస్తూ అమ్మకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో ఇద్దరూ పారిపోగా, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు వివరించారు.