RR: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన దేవా ఫుడ్ కోర్ట్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యజమాని మురళీకృష్ణ, డా. సౌజన్య దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, చంద్రమౌళి, రవీందర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.