ELR: ఏలూరు తూర్పులాకులు సమీపంలోని రైల్వే గేటును తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ లోకేష్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జులై 8 ఉదయం 7 నుంచి జులై 17 సాయంత్రం 5 వరకు రైల్వే గేటు మూసివేస్తున్నామన్నారు. రైల్వే పట్టాల అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.