ELR: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో 394 ఫిర్యాదులు అందాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.