SRD: పైపుల మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా 48గంటల పాటు నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారి విజయలక్ష్మి తెలిపారు. పైపుల లీకేజీ వల్ల 6 మండలాల్లో సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, అమీన్ పూర్, పటాన్ చేరువు, కంది, కొండాపూర్, సదాశివపేట తదితర మండలాల్లో 48 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.