BHNG: ఆపదలో ఉన్న కుటుంబానికి మిత్రులు అండగా నిలిచారు. భూదాన్ పోచంపల్లికి చెందిన కొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని మిత్రుడు షరీఫ్, ఫ్రెండ్స్ సహకారంతో సేకరించిన రూ.3,10,000 లను ప్రభాకర్ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వాటి పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో వారిని పలువురు ప్రశంసించారు.