MBNR: చిన్నపిల్లలకు సోకే క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా క్షయ నిర్మూలన అధికారి మల్లికార్జున్ వైద్య సిబ్బందికి సూచించారు. మిడ్జిల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లలకు సోకే క్షయవ్యాధి నిర్మూలనపై ఆశావర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు.