HYD: నగరంలో మీ ప్రాంతంలో నాలా కబ్జాకు గురైతే HYDRA కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయొచ్చు. వర్షాకాలం వేళ ఈ నెలలో నాలా కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. నాలా కబ్జాకు సంబంధించి ఆక్రమణను రుజువు చేసే గతంలోని ఫోటో, ప్రస్తుత ఫోటో జత చేసి, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు.