దాదాపు నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకునే అనుష్కను తెరమీద నాజూగ్గా చూపించాలంటే మరికొంత సిజీలకి ఖర్చు అవుతుంది. అది కూడా అంత వీజీగా అయ్యే పని కాదు. దానికీ బోలెడు ఖర్చు. తడిసి మోపెడు అవుతుందనే విషయం పరిశ్రమలో వారికే కాదు, ట్రేడ్‌లో ఉన్నవారికి కూడా అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుంచీ ఎగ్జిబిటర్ల వరకూ అందరికీ తెలిసిన రహస్యమే.
యువి క్రియేషన్స్ పతాకంపైన అనుష్క ప్రధాన పాత్రలో నిర్మాణమైన ఘాటీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూలై 11న విడుదలవుతున్నట్టు అధికారికంగానే వార్తలొచ్చాయి. విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేని పరిస్థితిలోకి జారిపోయిన యువి క్రియేషన్స్ ముందేదో విధంగా ఘాటీ సినిమాని వదిలించుకోవాలనే ముమ్మర ప్రయత్నంలో మునిగిపోయారు. కనీసం ఈ బరువైన దించుకుంటే విశ్వంభర సంగతి తర్వాత చూసుకుందామనే మైండ్ సెట్ లోకి యువి క్రియేషన్స్ అధినేతలు వచ్చేసినట్టుగా పరిశ్రమలో ప్రముఖులు మాట్లాడుకోవడం విశేషం. విచిత్రం కూడా. ఎందుకంటే ఘాటీకి విశ్వంభరకీ మధ్యన హన్తిమశకాంతరం ఉంది. కానీ అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్న యువి క్రియేషన్స్‌కి ఘాటీ రిలీజ్ లాకవడమే పెద్ద విముక్తిలా అనిపిస్తోందనే వ్యాఖ్యానాలు కూడా వినిపించడం మొదలైంది.
దాదాపు నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకునే అనుష్కను తెరమీద నాజూగ్గా చూపించాలంటే మరికొంత సిజీలకి ఖర్చు అవుతుంది. అది కూడా అంత వీజీగా అయ్యే పని కాదు. దానికీ బోలెడు ఖర్చు. తడిసి మోపెడు అవుతుందనే విషయం పరిశ్రమలో వారికే కాదు, ట్రేడ్‌లో ఉన్నవారికి కూడా అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుంచీ ఎగ్జిబిటర్ల వరకూ అందరికీ తెలిసిన అరవ రహస్యమే. అంటే అనుష్క కనిపించే ప్రతీ ఫ్రేమ్‌ని సీజి చేసి తీరాలి. ఏ ఒక్క ఫ్రేమ్ తేడా వచ్చినా ప్రేక్షకులకు నవ్వుకునేంత అవకాశం పుష్కలంగా దొరుకుతుంది. ఘాటీ సినిమా ఎంత బావుంది, కథ ఎంత ఎపెక్టివ్గా ఉంది, డైరెక్టర్ ఎంత బాగా తీశాడనే వివరాలను వదిలేసి ముందు అనుష్క రూపురేఖల మీద, అనుష్క ఫిగర్ అండ్ ఫేస్ మీద జనాలు పడిపోతారు ఇంకేముంది సోషల్ మీడియాకి కావాల్సినంత ఫుడ్.
ఘాటీ సినిమా అంతా ఒకెత్తు. అనుష్క మీద జరిగే సీజి లేబరేటరీ వర్క్ అంతా ఒకెత్తు. ఇదే ప్రధానం. అందుకే టోటల్ యూనిట్ దీని మీదే పూర్తి దృష్టిని పెట్టి మరీ రాత్రింబవళ్ళు కష్టపడి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నారని యూనిట్ లోని వారే చెప్పడం ఘాటీ సినిమాకి ప్రత్యేకమైన ఆసక్తిని తీసుకొచ్చింది. ఈ అవస్థలు గతంలో మిష్టర్ పోలిశెట్టి సినిమాకి కూడా దర్శకుడు మహేష్ మామూలుగా పడలేదు. మొత్తానికి మహేష్ సవ్యంగానే బైటకొచ్చేశాడు. మంచి సినిమా తీశాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు.
ఇప్పుడు మరో ఛాలెంజ్. వాళ్ళు, వీళ్ళూ చూస్తే సరిపోదు. సీజిల వర్క్ అంతా పూర్తయ్యాక మేడమ్ ఫైనల్‌గా చూడాలి. మేడమ్ ఇంప్రెస్ కావాలి. మేడమ్ ఎక్కడైనా కొంచెం తేడా అనిపించిందంటే కథ మళ్ళీ మొదలుకొస్తుందనే భయాందోళనలు కూడా లేకపోలేదు. అదే టఫ్ఫెస్ట్ ఛాలెంజ్ ఇందులో. ఇంతకీ మేడమ్ ఇంకా చూడలేదుట. అంతా పూర్తయ్యాక మేడమ్‌కి చూపించేందుకు టీం సిద్ధమవుతున్నారు. ఆమెకు ఎక్కడైనా పొరబాటున నచ్చకపోతే రిలీజ్ డేట్ మారిపోయే ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.