»Digital Rights For Vishwambhara Movie Release Depends On Digital Rights
డిజిటల్ కబంధ హస్తాలలో విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి సినిమాకే వచ్చిందంటే ఇంక సినిమా పరిశ్రమ బోర్డు తిప్పేసే పరిస్థితే వచ్చిందని లెక్క కడుతున్నారు సినిమా పెద్దలు. విశ్వంభర ఎంతగొప్పగా ప్రారంభమైందో, అంతే లోతుగా పడిపోయింది. ఫస్ట్ రిలీజ్ అయిన గ్లింప్సే నిరుత్సాహపరిచింది. దాంతో క్రేజ్ కాస్త నీరుగారిపోయింది. సోషల్ మీడియా మొత్తం కత్తి కట్టినట్టుగా విశ్వంభర సినిమాని మోసేశాయి. కోలుకోలేని దెబ్బ తగిలింది మెగాస్టార్ ఇమేజ్‌కి.
హీరోల దెబ్బకి నిర్మాతలన్నవాళ్ళే పూర్తిగా తెలుగు చిత్రపరిశ్రమలో కనుమరుగైపోయారన్నది జగమెరిగిన సత్యం. హీరోల ప్రాబల్యం పెరిగిన తర్వాత నిర్మాతలకుండే స్థాయి రేంజ్‌లు ఆసాంతం దెబ్బతినేశాయి. మార్కెట్ ఎంత పెరిగితే అంతగా హీరోలు నిర్మాతలని పక్కన పెట్టేసి, వాళ్ళని కేవలం చెక్‌ల మీద సంతకాలు పెట్టేపనివరకే పరిమితం చేసి పారేశారు. అయితే అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న నిర్మాతలు కూడా తదనుగుణంగా అదేం కథో, ఎక్కడ షూటింగ్ లొకేషనో కూడా తెలియకుండా, కేవలం ఆషీసుల్లో కూర్చుని కాలక్షేపం చేసుకుంటూ, ఎప్పుడో ఒకసారి షూటింగ్ స్పాట్‌కి వెళ్ళి, గుడికెళ్ళి దేవుడికి ఒకసారి దణ్ణం పెట్టుకుని, ఓ కొబ్బరికాయ కొట్టి మొక్కుకున్నట్టుగా, హీరోకి సాష్టాంగ దండ ప్రమాణం చేసి హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోతున్నారు. ప్రాజెక్టుని కమాండ్ చేయగల దమ్ము, గట్స్ ఉన్న నిర్మాతలే పూర్తిగా మాయమైపోయారు.
ఇప్పుడా హీరోలనే శాశిస్తోంది డిజిటిల్ ప్రపంచం. డిజిటల్ ఓకే కాకపోతే రిలీజ్ డేట్ కూడా వేసుకోలేని దుస్థితి పెద్ద హీరోల సినిమాలకే దాపురించిందంటే ఎంత దయనీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలుస్తుంది. తాడిని తన్నిన వాడుంటే వాడి తలని కూడా తన్నే వాడు వచ్చినట్టుగా వచ్చింది డిజిటల్ సామ్రాజ్యం. అమెజాన్ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా రూల్ చేస్తున్నాయి.
అదేదో ఎవరి సినిమాకో అంటే ఒకే. సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి సినిమాకే వచ్చిందంటే ఇంక సినిమా పరిశ్రమ బోర్డు తిప్పేసే పరిస్థితే వచ్చిందని లెక్క కడుతున్నారు సినిమా పెద్దలు. విశ్వంభర ఎంతగొప్పగా ప్రారంభమైందో, అంతే లోతుగా పడిపోయింది. ఫస్ట్ రిలీజ్ అయిన గ్లింప్సే నిరుత్సాహపరిచింది. దాంతో క్రేజ్ కాస్త నీరుగారిపోయింది. సోషల్ మీడియా మొత్తం కత్తి కట్టినట్టుగా విశ్వంభర సినిమాని మోసేశాయి. కోలుకోలేని దెబ్బ తగిలింది మెగాస్టార్ ఇమేజ్‌కి. దాంతో డిజిటల్ రైట్స్ గురించి ఎంత ట్రై చేసినా ఎవ్వరూ రెస్పాండ్ కాకుండా విశ్వంభర చిత్రానికి అతీగతీ లేకుండా చేశారు. దీనికి తోడు మొన్న శ్రీరామనవమికి విడుదల చేసిన రామా రామా అన్న పాట అన్నమో రామచంద్ర అని అడుక్కున్నట్టుగా చేసి సంగీత దర్శకుడు కీరవాణి అగ్నికి మరింత ఆజ్యం పోశాడు. పాట అతి ముష్టిగా ఉందని విమర్శకులు హోరెత్తిపోయారు. దీంతో మరింత విశ్వంభర ప్రతిష్ట దిగజారిపోయింది. డిజిటిల్ రైట్స్ కన్ఫర్మ్ అయితే గానీ, రిలీజ్ డేట్ డిక్లేర్ చేయలేని ఘోర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు నిర్మాతలు యువి క్రియేషన్స్ అధినేతలు.
మూలిగే నక్కమీద తాటిపండు పడిందన్నట్టుగా, అనుష్క నటించిన ఘాటి సినిమా తొందరగా డిజిటల్ రైట్స్ ఓకే అవడంతో ఆదేమో రిలీజ్కొచ్చేసింది. జూలై 11న రిలీజ్‌కి అన్ని సన్నాహాలు శరవేగంతో జరిగిపోతుంటే విశ్వంభర మాత్రం తెల్లబోయి చూస్తోంది. రెండు చిత్రాలనూ యువి క్రియేషన్సే నిర్మిస్తున్న దరిమిలా వాళ్ళు కూడా విశ్వంభర విషయంలో చేతులెత్తేసి చతికిలబడిపోయారు.
ఇందులో మరో ట్విస్ట్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదంతా పరిశీలిస్తూ, వెంటనే సంక్రాంతికి వస్తున్నాం ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రారంభించేసి, అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ కూడా కొట్టిపడేశారు. పరిశ్రమలో కూడా అందరూ చిరంజీవిగారు కూడా విశ్వంభర మీద ఆశలు వదులుకున్నారని బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. జూలై స్లాట్ ఖాళీ లేదు. ఇంక వెళ్తే సెప్టెంబర్‌లోనే వెళ్ళాలి. అప్పటికైనా విశ్వంభరకి డిఙిటల్ రైట్స్ ద్వారా మోక్షం వస్తుందేమో చూడాలి.
కొస మెరుపు ఏంటంటే……అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రారంభం అయిన తాజా చిత్రం ప్రారంభానికి ముందే ప్రకటించగానే డిజిటల్ రైట్స్ పండగ పూర్తియింది. విశ్వంభర ఎక్కడున్నట్టు? ఎప్పుడొస్తున్నట్టు?