రాజాసాబ్ టీజర్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ప్రభాస్ ఇంతవరకూ ఎప్పుడూ లేనంత ఫ్రెష్‌గా కనిపించడమే కాదు, చాలా చలాకీగా, హేండ్సమ్గా ఉన్నాడని చెబుతున్నారు. ఏ హీరోకైనా సరే, నిర్మాత టేస్ట్ అండ్ కెపాసిటీలు చాలా ఇంపార్టెంట్. దానికి తోడు దర్శకుడి హేండిలింగ్ కూడా తోడవ్వాలి. అప్పుడా కాంబినేషన్ హీరో ప్రజెన్స్ మీద, తనను తాను ప్రజెంట్ చేసుకునే విధానం మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది.
హమ్మయ్య….ప్రభాస్ ప్రపంచవ్యాప్త అభిమానులకు అగ్రనిర్మాత టిజి విశ్వప్రసాద్ గొప్ప రిలీఫ్ ఇచ్చారు. ఏనాటి నుంచో రాజాసాబ్ అప్డేట్స్ తెలియక అనూహ్యమైన తికమకలో ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. రాజాసాబ్ సినిమా ఆషామాషీ సినిమా కాదు. హయ్యస్ట్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో, బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఛాలెంజ్‌గా తీసుకుని మారుతి దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న రాజాసాబ్ మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. ఎందుకంటే మారుతీ దర్శకత్వం అంటే ఏదో తూతూ మంత్రంలా ఉంటుందేమోనని, నార్మల్ కామెడీ సినిమాలా తయారవుతోందేమోనన్న సంశయాలు పరిశ్రమ మొత్తం అలుముకుని ఉండడంతో రాజా సాబ్ టీజర్ ఈ నెల 16న అవుట్ అవబోతోందనే తాజావార్త ఓ కొత్త సంచలనానికి తెరదీసింది. ఆ చేత్తోనే రాజాసాబ్ విడుదల తేదీ కూడా డిసెంబర్ 5 అనే మరో షాకింగ్ న్యూస్‌ని విశ్వప్రసాద్ పేల్చారు. దాంతో దెబ్బకి పని గట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నవాళ్ళ నోళ్ళకి సడెన్‌గా తాళాలు పడిపోయినట్టయింది.
రాజా సాబ్ టీజర్కొస్తే….
చూసినవాళ్ళు చెబుతుంటేనే, అది వింటుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయని కొందరు చెబుతున్నారు. మామ్మూలుగా లేదంట టీజర్. సినిమాలో ముఖ్యమైన ఘట్టాలలో కొన్ని బిట్స్‌ని కట్ చేసి సాధారణంగా టీజర్‌ని రిలీజ్ చేసి అందరినీ టీజ్ చేయడమే టీజర్ లక్ష్యం. అదే సినిమా అయినా కావచ్చు. కానీ రాజాసాబ్ టీజర్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ప్రభాస్ ఇంతవరకూ ఎప్పుడూ లేనంత ఫ్రెష్‌గా కనిపించడమే కాదు, చాలా చలాకీగా, హేండ్సమ్గా ఉన్నాడని చెబుతున్నారు. ఏ హీరోకైనా సరే, నిర్మాత టేస్ట్ అండ్ కెపాసిటీలు చాలా ఇంపార్టెంట్. దానికి తోడు దర్శకుడి హేండిలింగ్ కూడా తోడవ్వాలి. అప్పుడా కాంబినేషన్ హీరో ప్రజెన్స్ మీద, తనను తాను ప్రజెంట్ చేసుకునే విధానం మీద స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అదే జరిగిందిప్పుడు రాజాసాబ్ సినిమా విషయంలో కూడా అని చెబుతున్నారు. విశ్వప్రసాద్ నిర్మాతగా దేనికి రాజీపడని గ్రేట్ గట్స్ ఉన్న బిజినెస్ మేన్. ఆయనికి తన సినిమా బాగా రావడమొక్కటే ప్రధానం. ఖర్చు కాదు. ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఆయన కేపబులిటీని క్యాచ్ చేయగలిగి గడుసైన దర్శకుడు మారుతీలాంటి సాలిడ్ టెక్నీషియన్ దొరకడం ఇక్కడ పెద్ద ప్లస్ పాయంట్ అయింది.
ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండగా సినిమా నిర్మాణమంతా పూర్తయింది. ఇటీవలి రోజులలో ప్రభాస్ సినిమాలలో ఇంత బాగా చిత్రీకరణ జరుపుకుని ఇంత త్వరగా పూర్తయినదే లేదని కూడా పరిశ్రమలో బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో నిర్మాత టిజి విశ్వప్రసాద్నే అందరూ మెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఆయన గతంలో తీసిన సినిమాలు వరసగా వైఫల్యాలను చవిచూసినా కూడా, ఆయనెక్కడా చెక్కుచెదరకుండా అదే చిరునవ్వుతో రాజాసాబ్ వర్క్ టేకప్ చేయడం, అంతే ఇంటాక్ట్ గా కంప్లీట్ చేయడమంటే ఆషామాషీకాదు. అదొక్క విశ్వప్రసాద్‌కి మాత్రమే చెల్లిందన్నది ట్రేడ్ టాక్. టీజర్ గురించే ఇంత గట్టిగా చర్చించుకుంటుంటే ఇంక రాజాసాబ్ సినిమా ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి.