The Raja Saab Teaser Talk : నిప్పులు చిమ్ముకుంటూ….
మారుతీ దర్శకత్వంలో ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్ హీరోగా సినిమా అనగానే ఒక్కసారి దుమారం లేచింది. ఏవో చిన్నాచితకా చిత్రాలు చేసుకుంటూ సాగుతున్న సాదాసీదా దర్శకుడు మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ అనగానే అందరూ కనుబొమ్మలు చిట్లించారు. ఎవ్వడికీ ఈ వార్త కొరుకుడు పడలేదు. ఇలా కొందరు, లేదా ఆందరూ అనుకోవడానికి కారణం లేకపోలేదు.
ఇవ్వాళే రాజాసాబ్ టీజర్ రిలీజైంది. టీజర్ అంటే ఈరోజు రిలీజైంది కానీ, సినిమా నిర్మాణవ్యవహరం మొదలై దాదాపు మూడు సంవత్సరాలవుతోంది. ఈ మధ్యలో అంతా అయోమయం. గందరగోళం. ఏం జరుగుతోందో, సినిమా ఎక్కడి వరకూ వచ్చింది, ఎంత పూర్తయింది, ఎప్పుడు రిలీజు కాబోతోంది ఏ అచోకి లేనేలేదు. సరే…ఇంకాస్త ముందుకెళ్తే మారుతీ దర్శకత్వంలో ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్ హీరోగా సినిమా అనగానే ఒక్కసారి దుమారం లేచింది. ఏవో చిన్నాచితకా చిత్రాలు చేసుకుంటూ సాగుతున్న సాదాసీదా దర్శకుడు మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ అనగానే అందరూ కనుబొమ్మలు చిట్లించారు. ఎవ్వడికీ ఈ వార్త కొరుకుడు పడలేదు. ఇలా కొందరు, లేదా ఆందరూ అనుకోవడానికి కారణం లేకపోలేదు.
ప్రభాస్ చేసిన సినిమాల లిస్ట్ చూస్తే ఎలాటి సినిమాలు అవి. వందల కోట్ల ఖర్చు. ఏళ్ళ తరబడి షూటింగ్. ప్రభాస్ ఇమేజ్‌ని పెంచగలిగే లేదా మేచ్ చెయ్యగలిగే భారీ స్టోరీ. ప్రపంచాన్ని త్రాసులో వేస్తే ప్రభాస్ సినిమాతో తూగేలేనంత బరువు ప్రభాస్ సినిమా. అదీ ప్రభాస్ ఇమేజ్. కానీ, ఇవన్నీ మారుతీకి ఎక్కడివి? వందల కోట్లలో బడ్జెట్ ఎవడు పెడతాడు? పోనీ మారుతీ ఏమైనా ఇంతకముందు సలార్ లాంటి సినిమా గానీ, కెజిఎఫ్ సినిమాలాటిది కానీ చేశాడా అంటే లేదు. భలేభలే మొగాడివోయ్, బాబు బంగారం లాంటి సినిమాలతో సూపర్‌డూపర్ హిట్లు కొట్టినా కూడా పెద్దపెద్ద నిర్మాతలు బరిలోకి దిగిపోయేంత బిల్డప్, హొయలు కూడా బొత్తిగా లేని మామ్మూలు యవ్వారం మారుతిది. అంత పెద్ద స్పేన్లో కథను రాసేస్తాడా అన్నది మరో డౌట్ అందరికీ. ఇలాంటి నేపథ్యలో మారుతీ కాంబినేషన్ శ్రీకారం చుట్టుకుంది. ప్రభాస్ పిచ్చెక్కింది అన్నవాళ్లు, పబ్లిక్‌గానే నెగెటివ్ కామెంట్ చేసినవాళ్ళు చిన్న నుంచి పెద్ద వరకూ ఉన్నారు ఇండస్ట్రీలో.
ఇక్కడే కథ మలుపు తిరిగింది. ప్రభాసే పిలిపించుకుని మారుతీని సినిమా చెయ్యమని అడగడమే ఇందులో కొసమెరుపు. ఏ అంచనాల మీద ప్రభాస్ ఇంత ధైర్యం చేశాడు అనేది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలతోనే అందరికీ మెంటల్ వచ్చేసింది. ఏనుగులు, పెద్ద పెద్ద కోటలు, విపరీతమైన హై ప్రొజెక్షన్‌తో, ఎలివేషన్లతో మామ్మూలు ప్రపంచంతో పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయిన ప్రభాస్‌లో ఎక్కడో అంతర్యుద్ధం మొదలైంది. తనకీ ఓ రిలీఫ్ కావాలనిపించింది. అదే చెప్పాడు మారుతికి. తనకి ఇష్టమైన సినిమాలు ప్రేమకథాచిత్రం, భలేభలే మొగాడివోయ్ లాగా ఏదైనా చెయ్యమని మారుతిని ప్రభాస్ అడగడమే హైలైట్ ఇందులో. మారుతీకి కూడా ఏం అర్ధం కాకుండా పోయింద. ప్రభాసేంటి తనతో సినిమా ఏంటి అని విస్తుపోయాడు. నేనేంటి, ప్రభాస్ అంతటి హీరోతోటి సినిమా ఏంటి అని పాడుకుంటూ బొంబాయి నుంచి హైదరాబాద్ తిరిగొచ్చేశాడు. బైటవాళ్ళ వరకూ ఎందుకు? ఇంట్లోవాళ్ళే నమ్మలేదు ఈ డెవలప్‌మెంట్‌ని.
కానీ, సినిమా పరిశ్రమలోని వింతలూ విచిత్రాలు మరోచోట జరగనే జరగవు.
కథ తయారైంది. ప్రభాస్ గుమ్మైపోయాడు. రొమాంటిక్ హారర్ అని, ఇంకొకటి అని, మరొకటని ఇప్పుడు అంటున్నారు. కానీ ముందుగా ప్రభాస్‌కి నచ్చింది కథలో ఉన్న దమ్ము. కొత్తదనం. వెరైటీ. తనని లైటర్ వెయిన్‌లో చూపించగలిగే మారుతీలోని ఒడుపు. వీటితో ప్రభాస్ దెబ్బకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇదంతా ఎవ్వడికీ తెలియదు. మారుతీ ఏ కథ చెప్పాడు, ఎలా ప్రభాస్‌ని పడేశాడు తెలియక గగ్గోలు పెట్టేశారు కొందరు మహానుభావులు. కన్నెర్రగా అనిపించింది అందరికీ.
ఓర్వలేరు కదా. ఒకడి ఎదుగుదలని ఓర్చుకోలేరు కదా. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు….అని మహాకవి శ్రీశ్రీ ఉత్తినే రాయలేదు. కానీ, మారుతీ కథాయజ్ఞం ఫలించింది. యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై, ఇదిగో వందల కోట్లేగా కావాలి….ఈ నిర్మాతనిస్తున్నాను తీసుకో, ఈ నిర్మాతైతే గుండెలు తీసిని మొనగాడు, వందల కోట్లు ఈయనకి జస్ట్ మంచినీళ్లు తీసుకో అని అదృశ్యమైపోయాడు. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, అగ్రనిర్మాత టిజి విశ్వప్రసాద్. పోయిన సినిమాల మీద వందల కోట్లు హుష్ కాకి అయిపోయినా కూడా తిరిగి భేతాళుడు చెట్టెక్కాడు అనే కథా ఆయన మళ్ళీ బస్తీమేసవాల్ అని బరిలోకి దిగిపోయారు. విశ్వప్రసాద్‌కి సినిమా పట్ల ఉన్న పేషన్ అలాటిది. ఎంత భారీ సినిమానైనా నిర్మించగల దమ్ములు, సొమ్ములూ రెండూ ఉన్ననిర్మాతగా ఆయన రికార్డు తిరుగులేనిది. అందుకే రాజాసాబ్ జరిగింది. పూర్తయింది. ఏదో కొంత వర్క్ ఫెండింగ్ ఉందని చెబుతున్నారు. టైం కూడా బోలెడుంది. మెయిన్ వర్క్ అయిపోయిందని దర్శకుడు మారుతీ ప్రభాస్ అభిమానులనుద్దేశించి చెప్పడం ఇందుకు నిదర్శనం.
పీపుల్స్ మీడియా ప్రయాణంలో రాజాసాబ్ బిగ్గెస్ట్ బడ్జెటెడ్ ఫిల్మ్ కాబోతోంది. పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు కూడా చాలా ఆసక్తికరంగా ప్రారంభమయ్యాయి. ప్రభాస్‌కి ప్రిస్టేజియస్ ఫిల్మ్ గిఫ్టుగా ఇవ్వడానికి విశ్వప్రసాద్ ఫుల్బ్లడ్తో పనిచేశారు. మారుతీ క్రియేటివ్ జీనియస్ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
రాజాసాబ్ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. విశ్వప్రసాద్ అనే నిర్మాత ఫాస్టెస్ట్ 100 పూర్తి చేయడం కూడా ఖాయం.