ఉపేంద్ర చేసిన రియలిస్టక్ సబ్జెక్టులు గానీ, లేదా తన హీరో పాత్రని తాను మౌల్డ్ చేసుకున్న విధానంగానీ పూర్తిగా విభిన్నంగా ఉండేవి. అవి కన్నడ సినిమాలకే కాదు, సౌత్ మొత్తం దుమారం లేపాయి. టైటిల్స్ కూడా ఉపేంద్రని ప్రత్యేకంగా చూపించాయి.
ఒకరేదే మెచ్చుకున్నారని కాదు గానీ, నిజంగానే సినిమాల మీద, దర్శకుల మీద కన్నడ స్టార్ ఉపేంద్ర ప్రభావం చాలా ఎక్కువ. ఉపేంద్ర చేసిన రియలిస్టక్ సబ్జెక్టులు గానీ, లేదా తన హీరో పాత్రని తాను మౌల్డ్ చేసుకున్న విధానంగానీ పూర్తిగా విభిన్నంగా ఉండేవి. అవి కన్నడ సినిమాలకే కాదు, సౌత్ మొత్తం దుమారం లేపాయి. టైటిల్స్ కూడా ఉపేంద్రని ప్రత్యేకంగా చూపించాయి. ఎ, స్వస్తిక్ మార్క్, ఓం ఇలా ఒకటి కాదు. ఉపేంద్ర కెరీర్ మొత్తం సంచలనాల మయం.
ఒకసారి ఎప్పుడో స్వస్తిక్ రిలీజ్ అయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆరోజే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఉపేంద్ర స్వస్తిక్ మార్క్ టైటిల్‌ని చూసి చాలా చాలా ముచ్చడపడిపోయారు. పక్కనే ఉన్న ఒకరిద్దరికి చూపించి భలే ఉంది కదూ అని మెచ్చుకున్నారు. అదీ ఉపేంద్ర ఇంపాక్ట్. ముఖ్యంగా మాస్ అండ్ యూత్ మీద ఉపేంద్ర తిరుగులేని ప్రభావాన్ని చూపించి, సౌత్ ఆడియన్స్ ని తన వైపు అమాంతం తిప్పుకున్నారు. ఆ మధ్యనే ఉపేంద్ర ఎ సినిమాని రీరిలీజ్ చేస్తే అది మళ్ళీ ఓ కలకలం సృష్టించింది.
ఈ విషయాన్నే సీతా పయనం సినిమా ఫంక్షన్‌కి ముఖ్యఅతిధిగా వచ్చిన సుకుమార్ ప్రస్తావించారు. తన మీద ఉపేంద్ర ప్రభావం ఎంతో ఉందని ఏమాత్రం అరమరికలు లేకుండా చెప్పడం అందరినీ బాగా ఆకట్టుకుంది. ఆసలు ఆ విధమైన పిచ్చిని, మూడ్‌ని, ఎమోషన్ని ఉపేంద్రలా క్రియేట్ చేయడం, రక్తి కట్టించడం ఎవరి వల్ల కాదని సుకుమార్ చెబుతుంటే ఉపేంద్ర ఆనందంతో పొంగిపోయాడు. తన రాసుకునే స్క్రీన్‌ప్లేలో ఉన్న గొప్పతనం, గాఢత కేవలం ఉపేంద్రదే అని అంతటి స్థాయికి వెళ్ళిన ఓ అగ్ర దర్శకుడు చెప్పడం నిజంగానే ఉపేంద్రకి తిరుగులేని ఓ గొప్ప కితాబే.
ఎ, ఓం, ఉపేంద్ర సినిమాల వంటివి ఎవరైనా చేయగలిగితే, ఆ మూడు చిత్రాల తర్వాత ఆ దర్శకులు హాయిగా, సంతృప్తిగా రిటైర్ అయిపోవచ్చని సుకుమార్ చెప్పడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎవరెందరైనా దర్శకులు ప్రతీ భాషలోనూ వస్తున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ ఉపేంద్ర స్కూల్‌ని, థాట్‌ని అనుసరించగలిగిన వారు గానీ, అనుకరించగలిగిన వారు గానీ లేనేలేరు. ఉపేంద్ర రూటే సెపరేటు.