మొత్తానికి ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ నిజమైంది. సంక్రాంతికి వస్తున్నాం తిరుగులేని బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్‌ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరి కలైనా, హీరోయిన్ కావచ్చు, కమెడియన్ కావొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ కావచ్చు, అందరి కల ఒక్కటే. అది మెగాస్టార్‌తో కాంబినేషన్. ఆనాటికి ఈనాటికి ఆ కలలో ఏక్కడా తేడా రాలేదు. మార్పులు చేర్పులు లేని ఒకే ఒక్క గమ్యం మెగాస్టార్ చిరంజీవి.
ఆ కల అనిల్ రావిపూడి విషయంలో చాలా వేగంగా, అతి త్వరగా నెరవేరిందనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సాధించిన ఘన విజయం అందుకు విపరీతంగా దోహదపడింది. ఎందుకంటే మెగాస్టార్‌తో సినిమా చెయ్యాలంటే ముందు దర్శకుడు అంత ఎత్తుకి ఎదగాలి. అనిల్ ఎదగగలిగాడు. తక్కువ టైంలోనే ఎక్కువ ఆధిక్యతను సాధించిన నేర్పు అనిల్‌ని మెగాస్టార్ ముందు మెగాఫోన్ పట్టుకుని నిలబడే సువర్ణాకాశాన్ని అందించింది. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌గా అనిల్ మార్క్ స్కీమింగ్తో రూపొందుతున్న సినిమా ఇది.
ఇందులో ఓ ప్రధానమైన పాత్రకి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వీరహిట్ని తన ఖాతాలో వేసుకున్న విక్టరీ వెంకటేష్ ఓకే చేశాడు. ఇద్దరి మధ్యనా సాగే ఎంటర్టైన్మెంట్ సీన్లు ధియేటర్లో ఎవరినీ కూర్చోనివ్వవు. దద్దరిల్లిపోతాయి ధియేటర్లు. ఒక్కొక్క సీను ఒక్కొక్క సినిమాలా వుంటుంది. అదీ యూనిట్ రిపోర్ట్.
అయితే ఇందులో ఓ ఇంట్రస్టింగ్ మేటర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు ఎంతో ప్రయత్నించారు. కానీ, మెగాస్టార్ మార్కెట్ డైమన్షన్ బట్టి, అప్పుడప్పుడే హీరగా ఎదుగుతూ, నిలదొక్కుకుంటున్న వెంకటేష్ మేచ్ కాలేకపోయాడు. అప్పట్టో మెగాస్టార్ మార్కెట్, సేల్స్, కలెక్షన్లు ఇండస్ట్రీకే టాప్‌లో ఉండేవి. దాంతో వాళ్ళ కాంబోకి అవకాశం రాలేదు. రామానాయడు ఎన్నో సార్లు చిరంజీవిని వచ్చి వ్యక్తిగతంగా కలుసుకున్నారు. అప్పుడు చాలా మేగజైన్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఉపయోగం లేకపోయింది.
ఇప్పుడు వెంకటేష్‌కి ఈ వయసులో సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్‌డూపర్ హిట్ రాగానే అది చిరంజీవి మార్కెట్ కన్నా ప్రస్తుత దశలో ఎక్కువగా కనబడుతోంది. అది ఈ కాంబినేషన్‌కి ప్లస్ అవుతోంది. ఆ కాంబినేషన్‌కి సరిపోయే కథ రాసుకోగలిగాడు అనిల్ రావిపూడి. అందుకే ఈ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోగలిగాడు. మెగాస్టార్ కామెడీ టైమింగ్, వెంకటేష్ ఎంటరైటైన్మెంట్ యాంగిల్ రెండూ సినిమాకి అద్భుతంగా కలిసొస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది వెంకటేష్ చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే సినిమా ఒప్పుకున్నాడనేది ట్రేడ్ రిపోర్ట్.