కొందరు తండ్రుల వల్ల పిల్లలకి పేరు, గుర్తింపు వస్తాయి. కొందరి విషయలో ఇది పూర్తిగా విభిన్నం. కొందరి పిల్లల వల్ల తల్లతండ్రులకు చాటింపు లభిస్తుంది. సచిన్ పెద్ద బ్యాట్స్ మేన్ అయ్యేవరకూ ఆయన తండ్రి ఎవరో ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు.చివరిగా ఆయన ఓ భారతరత్న తండ్రి చరిత్రలో. అలాగే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అనే చారిత్రక కథానాయకుడిగా చిరంతనమైన కీర్తిప్రతిష్టలకు కేంద్రబిందువుగాఎదిగిన తర్వాత గానీ ఆయన తండ్రి ఎవరు అనే సంగతే పూర్తిగా మృగ్యం.
కొణిదెల శివశంకర వరప్రసాద్ చిత్రపరిశ్రమలోకి వచ్చి చిరంజీవిగా మారి, అసంఖ్యాక ప్రేక్షక హృదయాలలో స్థిరంజీవిగాఎదిగి, మెగాస్టార్‌గా అవతరించేవరకూ ఆయన తండ్రి ఎవరో కూడా ఎవరికీ తెలియనే తెలియదు. ఆయనో సాధారణ ప్రభుత్వోద్యోగి. నీతినియామాలతో, నిజాయితీతో అహర్నిశలూ కష్టం పడడం, ప్రభుత్వం ఇచ్చే జీతానికి రెండింతలు పనిచేయడం తప్పితే మరో వ్యాపకం తెలియని ఓ నిరంకుశ ఉద్యోగిగా ఆయనకు పేరు.
కొందరు తండ్రుల వల్ల పిల్లలకి పేరు, గుర్తింపు వస్తాయి. కొందరి విషయలో ఇది పూర్తిగా విభిన్నం. కొందరి పిల్లల వల్ల తల్లతండ్రులకు చాటింపు లభిస్తుంది. సచిన్ పెద్ద బ్యాట్స్ మేన్ అయ్యేవరకూ ఆయన తండ్రి ఎవరో ప్రపంచానికి తెలిసే అవకాశం రాలేదు.చివరిగా ఆయన ఓ భారతరత్న తండ్రి చరిత్రలో. అలాగే మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి అనే చారిత్రక కథానాయకుడిగా చిరంతనమైన కీర్తిప్రతిష్టలకు కేంద్రబిందువుగాఎదిగిన తర్వాత గానీ ఆయన తండ్రి ఎవరు అనే సంగతే పూర్తిగా మృగ్యం.
కానీ, ఆయన గతంపొరలలోకి తొంగి చూస్తే, ఆయన సినిమా పట్ల అభిరుచి, అనురక్తి ఉన్న కళాకారుడే. ఏవో అరాఒకటి సినిమాల్లో కూడా చిరు పాత్రలు పోషించారని చెబుతారు. కానీ ఆయన ఉద్యోగ బంధనాలలో చిక్కుకుని, కుటుంబ బాధ్యతల ముందు మోకరిల్లి, తన కళాభిరుచిని పక్కన పెట్టేశారు. పూర్తినిడివి ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా, గర్వంగా ముగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారి తండ్రి పేరు కొణిదెల వెంకట్రావు. అని బాహ్యప్రపంచానికి బాహాటంగా తెలిసినా కూడా ఆయనెప్పుడూ ఓ షూటింగ్ దగ్గరికి వచ్చింది గానీ, చిరంజీవిగారికి జరిగిన సవాలక్ష విజయోత్సవ సభలలో గానీ ఎప్పుడు పీట వేసుకున్నది లేదు. ఆయనొక సత్సంగిలా మాత్రమే జీవితాన్ని గడిపారు. తన కొడుకు కట్టిన విలాసవంతమైన నాలుగు గోడలమధ్యన మౌనమునీంద్రుడిలా కాలాన్ని వెళ్ళబుచ్చారు. ఇప్పుడంటే సోషల్ మీడియాలో వచ్చాక ఆయన ఫోటోలు చూస్తున్నారు తప్పితే అంతకు ముందు ఆ ముచ్చట కూడా లేదు. ఏకాంతవాసంలో భార్యతో వానప్రస్థాశ్రమం అనే జీవనసంధ్యాకాలాన్ని నిశ్శబ్దంగా స్వీకరించారు. ఎంత కష్టం ఇది?
కొడుకేమో అరివీరభయంకరుడు. జగదేకవీరుడు. అప్రతిహత చిత్రసమరయోధుడు. ఎంతైనా ఆయనకి చెల్లుతుంది. ఏం చేసినా చెల్లుతుంది. కానీ, వెంకట్రావుగారు మాత్రం తనదైన జీవనశైలిని ఏ క్షణమూ చేజార్చుకోలేదు. కొడుకు నిర్మించిన వైభవశిఖరాలపైన నిలబడి ప్రపంచానికి కనిపించాలని కోరుకోలేదు. కొడుకు ప్రతిష్టని గుండెమారుమూలన దాచుకున్నారు. బైటకు కనిపించకుండా పదిలపరుచుకున్నారు. ఆయన పార్ధివదేహాన్నే చూసి ఓహో ఈయనా వెంకట్రావుగారంటే అనుకున్నవాళ్ళెందరో. కొడుకు పరిశ్రమలోకి అడుగుపెడతానంటే మనసారా దీవించారు. ఎదిగిన కొడుకు వెంటనే చేతికందకపోయినా ఆ బరువును కూడా మోసారు. కొడుకు అనతికాలంలోనే అగ్రస్థానానికి ఎదుగుతాడని ఎన్నడూ ఊహించలేని ఆ మౌనమనస్వి కొడుకు ఊడలు పరుచుకున్న తర్వాత కూడా ఆ నీడలోకి రావాలని అనుకోలేదు. చిరంజీవి పట్టుబడితే తప్పక ఆయన ఆదరణని అంగీకరించారు. కానుకలు తీసుకోలేదు. నాగబాబుని పరిశ్రమలో నిర్మాతగా నిలబెట్టాలనుకున్నప్పుడు కూడా అది పెద్ద కొడుకుకి బరువవుతోందేమోననే భావంతో వద్దు గాక వద్దని మొరాయించిన ప్రేమమూర్తి వెంకట్రావుగారు. అంజనా ప్రొడక్షన్స్ పతాకం మీద నాగబాబు నిర్మాతగా సినిమాలు తీస్తున్నా తనపేరు లేదని ఏనాడు అనుకోలేదు. కానీ, నాగబాబు బావగారు బావున్నారా సినిమాకి కె. వెంకట్రావు సమర్పించు అని మొదటిసారి పెట్టినప్పుడు అంత వరకూ చూడని బ్లాక్‌బస్టర్ కమర్షియల్ సక్సెస్‌ని తొలిసారి తన జీవితంలో నాగబాబు చవిచూశారు. అదే వెంకట్రావుగారి మౌనదీవెన.
ఇవన్నీ తెలిసినవాళ్ళకి తెలుసు. కానీ ఇవన్నీ ధ్వనించే విధంగా మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే నాడు పోస్ట్ పెట్టారు. అందులో ఆయన గుండెలో దాగున్న ఎన్నో జ్ఞాపకాలలో తడిసిపోయిన ఎన్నెన్నో అనుభూతులను ఆయన నెమరువేసుకున్నారు.
సచిన్ టెండూల్కర్ తండ్రిలాగానే వెంకట్రావుగారు కూడా రాబోయే రోజుల్లో ఓ భారతరత్న తండ్రిగా చరిత్ర పుటలమీద ఎత్తుగా నిలబడతారు.