NLR: అనంతసాగరం మండలంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఏడేళ్ల నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వేకువజామున ఉత్తరకాలువ వద్ద నిద్రిస్తున్న బాలుడిని, కమ్మవారిపల్లికి చెందిన రమేశ్ తన ట్రాక్టరుతో గమనించకుండా ఢీకొట్టాడు. తల్లిదండ్రులు విలపిస్తుండగా, రాజీ కుదుర్చుకొని మృతదేహాన్ని పెన్నానదిలో పూడ్చారు.
Tags :