వార్ 2 ట్రైలర్ తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై ఓ రకంగా చెప్పాలంటే జూనియర్ స్టేటస్‌ని బాగానే పెంచింది. ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎక్కడో తమ హీరోకి త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి, సరైన సముచితమైన గౌరవం దక్కలేదని పిచ్చెక్కిపోయిన మందికి వార్2 ట్రైలర్ కొంచెం కాలర్ ఎగరేసుకునే అవకాశాన్నిచ్చింది.
ట్రైలర్లు, టీజర్లు రాబోయే సినిమాలకి క్రేజ్, డిమాండ్ తీసుకురావాలనే ఆశతోనే రిలీజ్ చేస్తారు. కానీ అవే ఇప్పుడు కొన్ని సినిమాలకి ప్రాణాంతకంగా మారాయి. ట్రైలర్లు, టీజర్లలో క్వాలిటీ, విఎఫెఎక్స్ లెవెల్ బట్టి పబ్లిక్ రెస్పాండ్ అవుతున్నారు. బాగులేకపోతే మామూలుగా ఆడుకోవడం లేదు. అందుకు తాజా ఉదాహరణే వార్ 2 ట్రైలర్. తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై ఓ రకంగా చెప్పాలంటే జూనియర్ స్టేటస్‌ని బాగానే పెంచింది. ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఎక్కడో తమ హీరోకి త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి, సరైన సముచితమైన గౌరవం దక్కలేదని పిచ్చెక్కిపోయిన మందికి వార్2 ట్రైలర్ కొంచెం కాలర్ ఎగరేసుకునే అవకాశాన్నిచ్చింది. కానీ, అ ఆనందం నీరుగారిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ట్రైలర్లో గ్రాఫిక్స్ క్వాలిటీ బాగులేదని, బోడిలా ఉందని, చెత్తని సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది. దాంతో యష్ రాజ్ ఫిల్మ్స్ బెంబేలెత్తిపోయింది.ఇక్కడ తారక్ ఒక్కడే కాదు అవతల హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు కదా. దాంతో వాళ్ళకి వెన్ను జారిపోయింది. కోటానుకోట్ల ఖర్చు, కష్టం అన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయినట్టే. ఎవ్వడూ కొనడానికి ముందుకి రాడు. ఇదే అవస్థ ఇంతకు ముందు పఠాన్ సినిమా చవి చూసింది.
అంతెందుకు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న యువిక్రియేషన్స్ వారి విశ్వంభర చిత్రం కూడా ఇటువంటి దుస్థితినే ఎదుర్కొంది. మొట్టమొదట విడుదలైన గ్లింప్స్ చూసి అందరూ నొసలు చిట్లించారు. పెదవి విరిచేశారు. సోషల్ మీడియా వేదికగా దుళ్ళగొట్టేశారు. ఆ దెబ్బతో ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వాళ్ళు కూడా నిర్మాతల ఫోన్లు కూడా ఎత్తలేదు. ఇప్పటివరకూ ఓటిటి బిజినెస్సే కాలేదంటే విశ్వంభర చిత్రానికి మెగాస్టార్ చరిత్రకే ఎంత సిగ్గు చేటు. కానీ ఇది పచ్చినిజం. అదే ఇంకా షూటింగే ప్రారంభం కాని అనిల్‌రావిపూడి చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమా ఓటిటి బిజినెస్ క్లోజ్ అయింది. ఇది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ అనమాట. అందుకే చిరంజీవి కూడా వెంటనే ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించారు. మాయలఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నాదన్నట్టుగా సినిమా భవితవ్యాన్ని గ్లింప్స్, టీజర్ అండ్ ట్రైలర్లు దారుణంగా ప్రభావితం చేస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే తోవలో నడుస్తోంది మారుతీ డైరెక్షన్లో తయారువుతున్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అనిపించుకుంటున్న రాజాసాబ్ కూడా. రాజాసాబ్ గ్రాఫిక్స్ కూడా సరింగా రాని కారణంగా 40 కోట్లు వృథాగా పోయి, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా మొదలెట్టారు. అందుకే ఇప్పటికీ రిలీజ్ డేట్ ప్రకటించలేని దురవస్థ రాజాసాబ్ సీరియస్‌గా ఫేస్ చేస్తోంది.
ఆగస్టు 14నాడే వార్ 2తో పాటు విడుదల కాబోతూన్న రజనీకాంత్ లోకేష్ కనకరాజు కాంబోలో చిత్రం కూలీకి ఆఫర్ల కనకవర్షం కురుస్తుండంగా వార్ 2 మాత్రం ఆపసోపాలు పడుతోంది. ఇదీ కథ.