ఐదో రోజు పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(MNM) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఛైర్మన్ సమక్షంలో కమల్ హాసన్ తమిళ భాషలో ప్రమాణం చేశారు. సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్, ఇప్పుడు పార్లమెంట్లో ప్రజాసేవకు సిద్ధమయ్యారు. ప్రమాణస్వీకారం సందర్భంగా సభలోని సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.