E.G: గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 10.9 అడుగులకు చేరింది. బ్యారేజీకి 2.23 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇరిగేషన్ అధికారులు 150 గేట్లను ఎత్తి 2.46 లక్షల క్యూసెక్కుల అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మూడు ప్రధాన పంట కాలువలకు 8,500 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.