BHPL: జిల్లాలో రైతులు తమ పంటలకు వాడిన ఎరువులు, పురుగు మందుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు సహకార శాఖ ఏరువాక కార్డులను అందిస్తోంది. ఈ కార్డుల్లో రైతు వినియోగించిన ఎరువులు, పురుగు మందుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీంతో వినియోగ లెక్కలు సులభంగా తెలుస్తాయి. సహకార శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.