VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. 40-50 కి.మీ వేగంతో ఈదుగుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబరు, దక్షిణ కోస్తాలో మచిలీపట్నం, కృష్ణపట్నంలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.