BPT: వర్షాకాలంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి అన్నారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన ప్రణాళికపై జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎగువ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది వరద విపత్తును దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.