KMM: నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హార్టికల్చర్ అధికారి రాధిక తెలిపారు. నగరంలోని డివైడర్ మధ్యలో వోక్క(ఆరెకానట్) రకం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ మొక్కలు నగరానికి పచ్చదనం అందించడంతో పాటు, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయని చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్తులో మున్సిపల్‌కు ఆదాయాన్ని కూడా సమకూర్చే అవకాశముందన్నారు.