SRPT: అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలనే విషయం తెలిసేలా నడిగూడెంలోని జిల్లా జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల గోడలపై అత్యవసర ఫోన్ నంబర్ల వివరాలను రాశారు. విద్యార్థులు నిత్యం వాటిని చూడటం వల్ల వారికి అవగాహన వస్తుందని తెలిపారు. సత్వర సేవల వివరాలు తెలుసుకుంటారనే భావనతో ఇలా ఏర్పాటు చేసినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. ముఖ్యమైన చరవాణి సంఖ్యలను ఒకే చోట పొందుపరిచామని వెల్లడించారు.