MHBD: గంగారం మండలం కోమట్లగూడెం సమీపంలోని ప్రధాన రహదారి పై ప్రమాదకరంగా మారిన కల్వర్టును గూడూరు సీఐ సూర్య ప్రకాష్, గంగారం ఎస్సై రవి కుమార్ శుక్రవారం పరిశీలించారు. చెరువు మత్తడి వరద నీటి కారణంగా కోతకు గురైన ఈ ప్రాంతంలో ప్రమాద నివారణకు ఇసుక బస్తాలు వేయించి, సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ చర్యలు స్థానికుల భద్రత కోసం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.