సినీ దిగ్గజం, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కైకాల తెలుగు సినీ చరిత్రకు అందించిన సేవలను సీఎం కొనియాడారు. 800లకుపైగా చిత్రాల్లో సత్యనారాయణ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారని సీఎం గుర్తుచేశారు. విభిన్నమైన పాత్రలలో ఆయన చూపిన ప్రతిభ, సంభాషణలను పలికించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేనివని కొనియాడారు.