NRL: వలేటివారిపాలెం, లింగసముద్రం ప్రాంతాల్లో ఐరన్ ఓర్ లీజు విషయంపై వైసీపీ నేతలపై, AAP నేత మహేశ్వరరావుపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఇవాళ మండిపడ్డారు. 2023లో ఇచ్చిన లీజు జీవోలని అప్పటి ఎమ్మెల్యేలు, ఇప్పుడు MLCలు అయిన వారు ఎందుకు ఆపలేకపోయారంటూ ప్రశ్నించారు. విమర్శలు చేయడానికి ముందు నిజాలు తెలుసుకోవాలని తెలిపారు.