NLG: నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ వెనుక దాగి ఉన్న వైజాగ్ కాలనీ పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో విస్తరించిన ఈ ప్రాంతం, తన ప్రకృతి అందాలతో విశేషంగా ఆకర్షిస్తోంది. కృష్ణానదిలో బోటింగ్, చేపలు, నాటు కోడి కూర, జొన్న రొట్టెలు ఇక్కడ ఫేమస్. ఆదివారాల్లో పర్యాటకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారని స్థానికులు పేర్కొన్నారు.