VSP: శ్రావణమాసం సందర్భంగా సింహాచలం కొండపై శ్రీసింహవల్లి తాయారు సన్నిధిలో ఐదు శుక్రవారాలు ఉ.7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష్మీపూజ జరుగనుంది. ఒక్కొక్కరు రూ. 2,500 చెల్లించి పూజలో పాల్గొనవచ్చు. టికెట్లు కొండపైన పీఆర్వో ఆఫీసు, ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. భక్తుల సౌకర్యార్థం ఆ 5 శుక్రవారాల్లో కొండ దిగువ నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నారు.