MHBD: పాకాల సరస్సు జలకళ సంతరించుకుంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సరస్సులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శుక్రవారం నాటికి 23.02 ఫీట్లకు నీటి మట్టం చేరుకుంది. 30 ఫీట్ల పూర్తి స్థాయి ఉన్న పాకాల సరస్సు కింద సుమారు 20వేలకు పైగా ఆయకట్టు ఉంది. నర్సంపేట డివిజన్‌తో పాటు మహబూబాబాద్ జిల్లా రైతులకు ప్రధాన సాగు నీటి వనరుగా కొనసాగుతుంది.