TG: భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు మూడు, ఎనిమిదో గేటును ఓపెన్ చేసి నీటికి దిగువకు విడుదల చేశారు. రెండు గేట్ల ద్వారా 1,293 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అయితే, ముందుగా రెండో గేటును తెరిచేందుకు అధికారులు ప్రయత్నించగా.. మొరాయించడంతో సమస్య ఎదురైంది. దీంతో, మూడో గేటును ఓపెన్ చేశారు.