సత్యసాయి: మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, టీటీడీలో సేవలకోసం శక్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలను ఆలయ అర్చకులు అందించారు.