BPT: కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడర్ లోడుతో ద్రాక్షపల్లి నుండి విజయవాడ వెళుతున్న వెళుతున్న లారీ టైర్లు నట్లు ఒక్కసారిగా విరిగిపోవడంతో టైర్లు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో లారీ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.