KDP: జిల్లాలో రాయచోటి పట్టణం వద్ద మదనపల్లె రోడ్డులో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు వెళ్లింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడంతో ఊపిరి పీల్చుకున్నారు.. కాగా, స్థానికులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. బస్సును రాయచోటి డిపోకు తరలించారు.