తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ పునర్విభజన చట్టం ఆధారంగా నియోజకవర్గాలను పెంచాలని కేంద్రానికి ఆదేశాలివ్వాలని పేర్కొంటూ ప్రొ.పురుషోత్తం వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. 2026 తర్వాత జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ఉంటుందని సుప్రీం తేల్చి చెప్పింది.