కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ మూడు మతాల పెద్దలతో పీస్ కమిటీ సభ్యులతో టూ టౌన్ సీఐ హనీశ్ సోమవారం సమావేశం నిర్వహించారు. రాబోయే వినాయక నవరాత్రులలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మూడు మతాల పెద్దలు, పిస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.