ఆలిండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ నటుడు గద్దర్ అవార్డుకి సంబంధించి అల్లు అర్జున్ చెప్పిన మాట ఇది. నిజంగానే అల్లు అర్జున్ చాలా పెద్ద వార్ చేశాడు. పుష్ఫ 2లో ఎంతగా క్లైమాక్సు వరకూ ఫైట్ చేసి, చివరికి తనే తోపు అని నిరూపించుకున్నాడో అలాగే నిజజీవితంలో కూడా అంతే ఫైట్ చేశాడు. అదంతా మన కళ్ళ ముందే ఇటీవలే జరిగింది.
ఈ అవార్డు ఆర్మీకే అంకితం అంటే ఇటీవల జరిగిన ఇండో పాక్ వార్‌లో ప్రాణాలు కోల్పోయిన లేదా ప్రాణాలకి శౌర్యసాహసాలతో బోర్డర్ మీద బుల్లెట్ల వర్షం కురింపించిన ఇండియన్ ఆర్మీకి అనుకునేరు. ఈ అవార్డు ఆర్మీకే అంకితం అంటే తన ఆర్మీకి అని అర్ధం చేసుకోవాలి. ఆలిండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ నటుడు గద్దర్ అవార్డుకి సంబంధించి అల్లు అర్జున్ చెప్పిన మాట ఇది. నిజంగానే అల్లు అర్జున్ చాలా పెద్ద వార్ చేశాడు. పుష్ఫ 2లో ఎంతగా క్లైమాక్సు వరకూ ఫైట్ చేసి, చివరికి తనే తోపు అని నిరూపించుకున్నాడో అలాగే నిజజీవితంలో కూడా అంతే ఫైట్ చేశాడు. అదంతా మన కళ్ళ ముందే ఇటీవలే జరిగింది. ఫుష్ప 2 ఓ పక్కన ప్రపంచమంతా దద్దరిల్లిపోయేంతగా పెను సంచలనం సృష్టిస్తే, మరో వైపున అల్లు అర్జున్ ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున తీవ్రమైన సంఘర్షణను పేస్ చేశాడు.
తన సినిమా రిలీజునాడు తన అభిమానే తొక్కిసలాటలో చనిపోతే, ఆ కేసు కాస్త అల్లువారి ఇంటివైపుకి తిరిగింది. పోనీ తెలిసిన వెంటనే పరామర్శకి వెళ్ళాడా అంటే అది లేదు సరికదా తనకేం తెలియదని, తెలిస్తే మాత్రం తనకే సంబంధం అని కోర్టుకిచ్చిన అఫిడవిట్లో చెప్పడం కాక పుట్టించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరే మర్చిపోయాడు అనే కోపం సహజంగానే ఎవ్వరికైనా ఉండేదే. వచ్చేదే. తర్వాత బుర్రతిరుగుడుగా మనిషి చచ్చిపోతే కూడా అమానుషంగా తనకేం తెలియదంటాడా అనే ఆగ్రహం కట్టలు తెంచుకుంది అందరికీ. పర్యవసానంగా జైలు పాలయ్యాడు అల్లువారి అబ్బాయి.
పుష్ఫ 2 ప్రభంజనాన్ని లేశమంత కూడా అల్లు అర్జున్ ఆనందించలేని దిక్కుమాలిన పరిస్థితులను చవి చూసిన హీరోగా అల్లు ఆర్జున్ మరో రికార్డు కూడా కైవశం చేసుకున్నాడు. మెల్లిగా ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా, కేసులో నుంచి బైట పడ్డాడు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి పుణ్యమా అని జరిగిందని ప్రపంచమంతా కోడై కూసింది. అందులో నిజం కూడా లేకపోలేదు.
ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత వచ్చిందీ ఉత్తమ నటుడు అవార్డు. ఎలా ఉంటుంది? పుండు మీద కారం చల్లినట్టే. కానీ తీసుకోక తప్పదు. అది తన కష్టానికి, అంకితభావానికి లభించిన పురస్కారం. కాదనగలడా? కాదంటే మరో రగడ రాజుకుంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఫైర్ బ్రాండ్. ముఖ్యమంత్రిగా తన ప్రాబల్యాన్ని చాటి చెప్పుకోవడంలో చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. అందుకే కామ్‌గా అల్లు అర్జున్ అవార్డ్ తీసుకుని, తనదైన ఎమోషన్‌తో తన అభిమానులకే ఈ ఉత్తమ నటుడు అవార్డు అంకితం అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అవార్డు తీసుకున్నట్టూ ఉంది. తనకేం సంబంధం లేదన్నట్టూ ఉంది. ఎవ్వరూ తక్కువ వాళ్ళు లేరు.