నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి గానూ గద్దర్ అవార్డును గెలుచుకున్న సందర్భంలో భార్య ప్రియాంక, నిర్మాత, నాగ అశ్విన్ మామగారు అశ్విన్ దత్ ముగ్గురూ వేదికపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి ప్రియాంక గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ప్రియాంకకి చిన్నప్పుడే చెప్పాను, రెడ్లబ్బాయిని పెళ్ళి చేసుకొమ్మని, అలాగే తాను చెప్పినట్టే రెడ్లబ్బాయినే పెళ్లి చేసుకుని ఇప్పుడు వేదిక మీదకి వచ్చిందని రేవంత్ రెడ్డి అనడంతో సభలో చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు.
కరెక్టు కాకపోవచ్చు, సభా మర్యాద కూడా కాకపోవచ్చు, కానీ అందరూ మనుషులే, మనసులోని ఆలోచనలను నియత్రించుకోలేని అశక్తులేనన్నది కొన్ని సందర్భాలలో రుజువవుతుంటుంది. మొన్నీమద్య గద్దర అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రినే అయినా కూడా తన ఆలోచనలను అణచుకోలేకపోయాడు.
రాజు ఎప్పుడూ తప్పు చేయడు అనే రోమన్ సామెతలా రేవంత్ రెడ్డి అన్నమాట హర్షధ్వానాలను అందుకుంది. అదీ అందులో స్పెషల్ టచ్. కులాలు, మతాల గురించి సాధారణంగా ముఖ్యమంత్రులు బహిరంగంగా ప్రస్తావించరు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి. ఆదే గాకుండా, కుల వివక్ష బహిర్గతం అవుతుందనే ఆలోచన కూడా ఉంటుంది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి విభిన్నం. ఆయన నైజం పూర్తిగా విలక్షణం. నాగ అశ్విన్ ఉత్తమ దర్శకుడిగా కల్కి చిత్రానికి గానూ గద్దర్ అవార్డును గెలుచుకున్న సందర్భంలో భార్య ప్రియాంక, నిర్మాత, నాగ అశ్విన్ మామగారు అశ్విన్ దత్ ముగ్గురూ వేదికపైకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి ప్రియాంక గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.
ప్రియాంకకి చిన్నప్పుడే చెప్పాను, రెడ్లబ్బాయిని పెళ్ళి చేసుకొమ్మని, అలాగే తాను చెప్పినట్టే రెడ్లబ్బాయినే పెళ్లి చేసుకుని ఇప్పుడు వేదిక మీదకి వచ్చిందని రేవంత్ రెడ్డి అనడంతో సభలో చాలామంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. అవును. నాగ్ అశ్విన్ రెడ్డి కులస్తుడే. సుప్రసిద్ధ వైద్యురాలు జయంతి రెడ్డిగారి కుమారుడు. షార్ట్ ఫిల్మ్స్ ఏవేవో చేసి, మొత్తానికి వైజయంతీ మూవీస్ ఆవరణలోకి అడుగు పెట్టాడు నాగ అశ్విన్. కరెక్టుగా అప్పుడే అగ్రనిర్మాతగా అనేక దశాబ్దాలు వెలుగొందిన అశ్వనీదత్ శక్తి సినిమాతో పూర్తిగా కుదేలై, చిత్రనిర్మాణానికి కొద్దికాలంగా దూరంగా ఉంటూ వచ్చిన టైం అది. అప్పుడే నాగ అశ్విన్ చెప్పిన కథని ఓ చిన్నస్థాయిలో సినిమాగా తీస్తామని ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక పూనుకున్నారు. సరేనన్నారు అశ్విన్ దత్. అదే ఎవడే సుబ్రహ్మణ్యం. దత్తుగారి ప్రాబల్యం, పలుకుబడితో నాని కూడా వైజయంతీ మూవీస్ మీద గౌరవంతో, కథ నచ్చి సినిమా ఒప్పుకున్నాడు. అదిగో అప్పుడే ప్రియాంక, నాగ అశ్విన్‌ల ప్రయాణం ప్రారంభమైంది. సినిమాగా ఎవడే సుబ్రహ్మణ్యం పెద్ద హిట్ కాకపోయినా, ఓ మంచి సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది. దర్శకుడిగా నాగ అశ్విన్‌కి కూడా స్ట్రాంగ్ ఇమేజ్‌నే ఇచ్చింది. ఆ సినిమా టైంలోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలై, అది పెళ్లి వరకూ వెళ్ళింది. పెద్దల దీవెనలతో పెళ్ళి ఘనంగా జరిగిపోయింది.
దాన్నే రేవంత్ రెడ్డి మళ్ళీ కోట్ చేసి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సభ్యులుగా రేవంత్ రెడ్డికి, అశ్వినీ దత్‌కి మధ్యన గాఢమైన సాన్నిహిత్యమే ఉంది. గట్టి స్నేహబంధమే వారిది. ఆ చనువుతోనే రేవంత్ రెడ్డి ఆ మాటలు అన్నారని అనుకున్నారందరూ.
ఏది ఏమైనా, రేవంత్ రెడ్డి మంచి మాటకారి. ఏ మాటనైనా సందర్భోచితంగా, ఆహ్లాదకరంగా అనగలరు, అని ఒప్పించగలరు అన్నదానకి ఇదొక సందర్భం.