కొన్ని చిత్రాలకు అవార్డులొస్తే ఆయా చిత్రాలకు విలువలు, గుర్తింపూ లభిస్తాయి. కొన్ని చిత్రాలను వరించడం ద్వారా కొన్ని అవార్డులకు గుర్తింపు లభ్యమవుతుంది. కల్కి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, దాదాపు 14 సంవత్సరాలుగా మూగబోయిన తెలంగాణ సినిమా అవార్డుల సంబరాలకు ఎనలేని వన్నె తెచ్చింది.
కొన్ని సినిమాలని సినిమాలు అనకూడదు. కళాఖండాలు అనాలి. లేదా దృశ్యకావ్యాలనాలి. ఎందుకూ అంటే అటువంటి సినిమాలు దేశకాలమాన పాత్రాలను దాటి, చరిత్రను మార్చేసి, సరికొత్త చరిత్రను లిఖించి, సాంకేతిక కళారూపానికే సార్వజనీనతను అద్దగలుగుతాయి. అవి ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా సరే మరపుకురావు. మరచిపోలేం. అటువంటిదే కల్కి.
ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సువర్ణహస్తాల మీదుగా లిఖించబడి, మలుపుమలుపుకీ జైత్రయాత్రలు నెరపిన వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ చలసాని నిర్మించిన కల్కి చిత్రం ఈ ఏడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమోత్తమ చిత్రం. వినడానికి చాలా సహజంగా ఉంది. కొన్ని చిత్రాలకు అవార్డులొస్తే ఆయా చిత్రాలకు విలువలు, గుర్తింపూ లభిస్తాయి. కొన్ని చిత్రాలను వరించడం ద్వారా కొన్ని అవార్డులకు గుర్తింపు లభ్యమవుతుంది. కల్కి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, దాదాపు 14 సంవత్సరాలుగా మూగబోయిన తెలంగాణ సినిమా అవార్డుల సంబరాలకు ఎనలేని వన్నె తెచ్చింది. ఇక్కడ మన తెలంగాణలోనే కాదు, ప్రపంచంలో ఏ అవార్డు ఎక్కడ ప్రకటించిన ఆ సదరు అవార్డుకే ఇదమిద్ధమైన, నిర్దిష్టమైన గుర్తింపునివ్వగల ఏకైక చిత్రంగా కల్కి సినిమాని అందరూ ఒప్పుకోవాల్సిందే.
అటు పురాణేతిహాసాల నుండి ఇటు మోడర్న్ టెక్నాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ విజన్ అన్నీ ఒకే కథాగమనంలో సమగ్రంగా కుదిరాయంటే అదొక్క కల్కి చిత్రంలోనే జరిగింది. హాలీవుడ్ చిత్రాలకు లేని గొప్ప సొగసు, సాంకేతికమైన మెరుపు కల్కి సినిమాకి మాత్రమే కుదిరాయి. ఆ మేరకు దర్శకుడు నాగ అశ్విన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సార్ధకతను కల్కి చిత్రం ద్వారా సాధించడం యావత్తు తెలుగు సినిమా చరిత్రకే దక్కిన గొప్ప గౌరవం. ఇటువంటి సినిమాని కేవలం కలగనగలిగే దమ్ము ఒక్క అశ్వనీదత్ చలసానికి మాత్రమే ఉన్నదన్న వాస్తవాన్ని గతంలో కూడా ఆయన జగడేకవీరుడు అతిలోకసుందరి లాంటి చిత్రాన్ని నిర్మించి ఆనాడే చాటుకున్నారు. మోడర్న్ సినిమా ప్రపంచంలో జగదేకవీరుడు అతిలోకసుందరి ఒక గగుర్పాటు. ఒక కుదుపు. అదుపులేని ఖర్చుతో, హద్దే లేని ధైర్యసాహసాలతో అశ్వనీదత్ నిర్మించిన కల్కి ఐదు దశాబ్దాల ఆయన ఘనకీర్తికి అలంకరించిన వజ్రకిరీటం. ఇంకా పార్ట్ 2 ప్రారంభం కావాల్సిఉండగా తొలి భాగంతోనే బాక్సాఫీసులో భూకంపం సృష్టించిన సంచలనం ఆయనకి మాత్రమే సొంతం. ఎవ్వరూ కనీసం కలలో కూడా ఊహించని కథా సంవిధానాన్ని దర్శకుడు నాగ అశ్విన్ సృష్టిస్తే, దానికి తెరరూపాన్ని ఇవ్వడంలో తనదైన స్ఫూర్తిని, కళాభిరుచిని ప్రదర్శించగలగడం ఎన్నాళ్ళకైనా, ఎన్నేళ్ళకైనా అశ్వనీదత్ చలసానికి మాత్రమే చెల్లింది.