TG: మాజీ మంత్రి హరీశ్ రావుకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించలేదు అనే మాట నిజమా? బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉందన్న అభియోగాలపై స్పష్టత ఇచ్చి.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు ముందు హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు.