అన్నమయ్య: ఐపీఎల్ -2025 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలవడంతో ఉమ్మడి కడప జిల్లాలో మంగళవారం రాత్రి ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. రాజంపేట పట్టణంలోని మెయిన్ రోడ్లో RCB ఫ్యాన్స్ కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. “ఈ సాలా కప్ నమ్దు” అంటూ ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.