VZM: డెంకాడ పట్టణ కేంద్రంలో రోడ్డు భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులతో గురువారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు సక్రమంగా నిర్వహించని వారిపై కొరడా ఝులిపించారు. ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సరైన వాహన పత్రాలు ఉండాలని కోరారు. తనిఖీ సమయంలో వాహన పత్రాలు లేనివారి జరిమానా విధించామని ఎస్సై సన్యాసి నాయుడు తెలిపారు.