BHPL: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజరై, మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.