ATP: గుత్తిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణకు శనివారం ఏర్పాటు చేస్తున్న స్పీడ్ బ్రేకర్ల పనులను సీఐ వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుతో కాలనీ వాసులు హర్ష వ్యక్తం చేశారు.