ADB: జిల్లా కేంద్రంలోని డైట్ మైదానం సమీపంలో గల రోడ్డుపై చెత్త పేరుకు పోయింది. అస్తవ్యస్తంగా చెత్త పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా మారాయి. చెత్తాచెదారం నిలిచి ఉండటంతో దోమల వృద్ధి చెందే అవకాశం ఉందని కాలనీవాసులు పేర్కొన్నారు. సంబంధిత మున్సిపల్ కార్మికులు స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.