కృష్ణా: హాస్టళ్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం అవనిగడ్డలోని సాంఘీక సంక్షేమ శాఖ వసతి గృహం-1లో రూ.11లక్షలతో చేపట్టిన పనులను వెంకట్రామ్ పరిశీలించారు. నియోజకవర్గంలో 18 హాస్టళ్లకు పెయింటింగ్, మరుగుదొడ్లకు నీటి వసతి పునరుద్దరణ, వంట గదికి టైల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.