KKD:పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సహకారంతో హుస్సేన్ పురంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు టీడీపీ నేత చల్లా బుజ్జి తెలిపారు. డంపింగ్ యార్డ్ లేకపోవడంతో రోడ్ల పక్కన చెత్త వెయ్యాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గురువారం డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ఒక స్థలాన్ని పరిశీలన చేశామన్నారు.