భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి అవమానం జరిగిందని నెటిజన్లు మండిపడుతున్నారు. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నెం. 18ని మరొకరికి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత- A జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించాడు. దీంతో విరాట్ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లేనని BCCIని టార్గెట్ చేస్తున్నారు.