సత్యసాయి: హిందూపురం ఎన్ఎస్పీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 140 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. సుమారు 300 మంది నిరుద్యోగులు మేళాలో పాల్గొన్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ డా. ప్రగతి తెలిపారు. 15 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, 140 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని చెప్పారు.