E.G: రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆగస్టు 3వ తేదీన అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి శివకుమార్ తెలిపారు. అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికల పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు 9 నుంచి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.